డైరెక్టర్ అవ్వకముందు నుంచీ 'వంగవీటి' సినిమా తీయాలని అనుకున్నానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపాడు. విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన 'వంగవీటి' సినిమా ఆడియో వేడుకలో వర్మ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ చేయడానికి కాలేజీకి వచ్చాను కానీ, నేర్చుకున్నది మాత్రం ఇక్కడి వాతావరణాన్ని అని అన్నారు. తన జీవిత, సినీ అనుభవం మొత్తం విజయవాడ నుంచే ప్రారంభమైందని ఆయన చెప్పారు.