టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ లో ఉన్నవాళ్ళు ఇగోలకి పోతే...వారికి కెరీర్ అనేది చాలా తక్కువుగా ఉంటుంది. అందుకే సక్సెస్ ఫుల్ గా ఫిల్మ్ కెరీర్ ని కొనసాగిస్తున్న టాప్ ఫిల్మ్ సెలబ్రిటీలు అందరూ...ఇగో లకి దూరంగా ఉంటారు. తాజాగా దిల్ రాజు సైతం ఓ హీరో విషయంలో అటువంటిదే చేశాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...మాస్ మహారాజ్ రవితేజ, దిల్రాజు కాంబినేషన్లో గతంలో ఓ మూవీకి పూజా కార్యక్రమాలను జరుపుకుంది.