English Music Review

హీరో వెంకటేష్ నటిస్తున్న కొత్త సినిమా ‘షాడో’.  ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో తాజాగా విడుదల అయ్యింది. మాఫియా నేపధ్యంగా తెరకెక్కుతున్న ఈ ‘షాడో’ సినిమా పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం...! 1) షాడో టైటిల్ సాంగ్ గానం : బాబా సెహాగల్, నవీన్ సాహిత్యం : చంద్రబోస్ ‘మండే సూర్యుడు’ వంటి పదాలతో ఈ పాట వెంకటేష్ ఇమేజ్ ను మరింతగా పెంచేవిధంగా ఉంది. ఈ టైటిల్ సాంగ్ లో   ఎలాంటి ప్రత్యేకత లేదు. ఎస్.ఎస్.థమన్ పాత పాటలను గుర్తుకు తెస్తుంది. అయితే చిత్రీకరణ తో ఆకట్టుకునే అవకాశాలు ఈ పాటకు ఉన్నాయి. 2) గోల గోల గానం :  హేమచందర్, రమ్య, వందన సాహిత్యం : విశ్వ ప్రేమికుల మధ్య సాగే యుగళ గీతం. హేమచంద్ గాత్రం ఈ పాటకు కొత్త అందాన్ని తెచ్చింది. సాహిత్యం-సంగీతం సాధారణంగా ఉన్నాయి. 3) పిల్ల మంచి బందోబస్తు గానం : హేమచందర్, సుచిత్ర సాహిత్యం : భాస్కరభట్ల   హీరో- హీరోయిన్ మధ్య సాగే సరదా అయిన యుగళ గీతం. ఆకట్టుకునే సరదా పదాలతో ఈ గీతం సాగుతుంది. ఈ ఆల్బమ్ లో ఆకట్టుకునే గీతం ఇది. 4) నాటీ గర్ల్ గానం :సింహా, గీతామాధురి సాహిత్యం : భాస్కరభట్ల షాడో సినిమాలోని ఐటెమ్ సాంగ్ ఇది. హుషారుగా సాగుతుంది. వెంకటేష్ కు ఉన్న మాస్ అభిమానులను అలరించే విధంగా ఈ గీతం ఉంది. గీతమాధురి గొంతు ఈ పాటకు చక్కగా సరిపోయింది. 5) అత్యలక గానం : హరి చరణ్, రంజీత్, రాహుల్, మెగా, రెత, అనిత సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి పక్కా మాస్ గా ఈ గీతం సాగుతుంది. సులువైన పదాలను వాడుతూ ఈ పాట సాగుతుంది. హీరో పాత్రను సూచించే విధంగా ఈ గీతం ఉంది. 6) షాడో రివేంజ్ సాంగ్ సాహిత్యం : రామజోగయ్య శాస్ర్తి షాడో సినిమాలో వచ్చే నేపథ్య గీతం. ఆకట్టుకునే పదాలను ఈ గీతంలో సమకూర్చారు రచయిత.      

మరింత సమాచారం తెలుసుకోండి: