ప‌విత్ర‌గా శ్రియ హంగామా చేస్తోంది. ఇంత‌కు ముందెప్ప‌డులేని అంద‌చందాల‌తో క‌వ్విస్తోంది. ఈ సినిమాలో శ్రియ ఓ వేశ్య పాత్ర పోషిస్తోంది. వేశ్య అంటే ఆ మాత్రం కిక్ ఉండాలి క‌దా? డ‌్ర‌స్సింగ్‌, మ‌త్తెక్కించే ఆ చూపులు... ఇవ‌న్నీ పోస్ట‌ర్ల‌లోనే క‌నిపిస్తున్నాయి. ప‌విత్ర‌గా చాలా బోల్డ్‌గా న‌టించింద‌ట‌. కొన్ని సంభాష‌ణ‌లైతే... దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజులోఉన్నాయ‌ట‌. డ‌బుల్ మీనింగ్ డైలాగులు చెప్పేట‌ప్పుడూ ఏమాత్రం అడ్డుచెప్ప‌లేద‌ట‌. శ్రియ ఏమిటి? మ‌రీ ఇంతిలా రెచ్చిపోయింది అని సినీ జ‌నాలు ముక్కున వేలేసుకొంటున్నారు. ప‌విత్ర టీజ‌ర్‌, ప్ర‌చార చిత్రాలు ఇప్ప‌టికే వేడి పుట్టించాయి. `చూసింది కొంతే.. చూడాల్సింది చాలా ఉంది` అని ద‌ర్శ‌కుడు జ‌నార్థ‌న మ‌హ‌ర్షి కూడా ఊరిస్తున్నాడు. దొంగ బాబాలు, కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కులు, సినీ స్టార్స్‌పై వ్యంగ బాణాలు ఉన్నాయ‌ట‌. మ‌రి ప‌విత్ర ఎవ‌రిని టార్గెట్ చేసిందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: