అంతకుముందు ఒక చిత్రంలో నటించినా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన హ్యాపీడేస్ చిత్రంతోనే తమన్నాకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఇక తరువాత నుంచి తమన్నా వెనుతిరిగి చూడటం లేదు. నెంబర్ వన్ దిశగా సాగుతుంది. కాగా, శేఖర్ కమ్ముల తాజాగా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో ప్రేక్షకలు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కూడా హ్యపీడేస్ సినిమా మాదిరిగా కొత్తవారితో, దాదాపుగా అలాంటి కథాంశంతోనే రూపుదిద్దుకుంటుంది. మరి ఈ సినిమాతో తమన్నాలా గుర్తింపు తెచ్చుకునే సుందరి ఏవరో తెలియాలంటే ఆగస్టు 15 వరకూ వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: