తెలుగు పాటకు ఒరవడి దిద్దిన సినారె వందల సినిమా పాటలను రాశారు. భారత ప్రభుత్వం బహుకరించే ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి 1931, జులై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీ పేట అనే కుగ్రామంలో జన్మించారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. ఉన్నత చదువులు చదివిన సినారె ఉస్మానియా యూనివర్శిటీలో అధ్యాపకునిగా పనిచేశారు. తెలుగు రచనలో అన్ని విభాగాల్లోనూ ఆయన రచనలు సాగించారు. సినారె రచించిన విశ్వంభర అనే కావ్యానికి జ్ఞనపీఠ్ అవార్డు లభించింది. విశ్వనాథ సత్యనారాయణ తరువాత ఆ అవార్డు సినారెకు దక్కింది. సినారె 1962 సంవత్సరంలో సినిమా రంగంలోకి ప్రవేశించారు. గులేభకావళికథ సినిమా కోసం ఆయన రాసిన ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని’ ఎంతో సూపర్ హిట్ అయింది. ఇక అప్నటి నుంచి ఎన్నో హిట్ సినిమాలకు ఎన్నో సూపర్ హిట్ పాటలు రాసారు. సినారె గారిది బాల్య వివాహం. సినారెకు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అనే నలుగురు కుమార్తెలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: