రాజమౌళి ఈగ సినిమాతో హీరో నాని దశ తిరిగింది. అంతకు ముందు వరకూ మెల్లిగా సాగిన నాని కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది. తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి నానికి మంచి అవకాశాలు వస్తున్నాయి. తమిళ దర్శకుడు సముద్రఖని రూపొందించే ద్విభాషా సినిమాలో నాని నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 1న హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో నాని సరసన అమలాపాల్ నటిస్తుంది. దీంతో ఈగలో సమంతతో రొమాన్స్ చేసిన నాని ఇప్పుడు అమలాపాల్ తో ప్రేమాయణం ప్రారంభించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: