సంచలన దర్శకుడు శంకర్-విక్రమ్ కాంబినేషన్ లో మరో చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే ఈ జంట ‘అపరిచితుడు’ చిత్రాన్ని చేశారు. చాలా కాలం తర్వాత ఈ కాంబినేషన్ లో చిత్రం రావడంపై అభిమానుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. కాగా ‘రోబో’ చిత్రం తర్వాత శంకర్ రూపొందించిన ‘నన్బన్’ (తెలుగులో స్నేహితుడు) చిత్రం తీవ్రంగ నిరాశపరచింది. గతంలో శంకర్ రూపొందించి ‘ప్రేమిస్తే’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. అయితే శంకర్ చిత్రాలకు భిన్నంగా నన్బన్ ఘోరపరాజయంతో ఆ చిత్రం ఓ గుణపాఠం నేర్పింది. ఇక తాను రిమేక్ ల జోలికి వెళ్లనని శంకరే స్వయంగా చెప్పడం గమనార్హం. కాగా ఈ సారి శంకర్ తన చిత్రాలకు భిన్నంగా ఎటువంటి సామాజిక అంశాన్ని ప్రజెంట్ చేయకుండా విలక్షణ నటుడు విక్రమ్ తో ఓ విభిన్న చిత్రాన్ని చేస్తున్నారు. ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న విక్రంకు నిజంగానే శంకర్ చిత్రం ఆక్సిజన్ లా పనిచేస్తుందని తమిళ పరిశ్రమ వర్గాలన్నీ చెవులు కొరుక్కుంటున్నాయి. అయితే ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ని ఖరారు చేయలేదుగానీ ఇప్పటికే షూటింగ్ మొదలుచేసి ఫస్ట్ లుక్ కాపీని సైతం శంకర్ తమిళనాడులో విడుదల చేశారు. చూడగానే ఆసక్తిని కలిగిస్తున్నాయి ఆ పోస్టర్లు. దీంతో ఒక్కసారిగా ఈ చిత్రంపై గత అంచనాలను మించి ప్రేక్షకులు రెస్పాన్స్ ఇస్తున్నారు. పైగా అపరిచితుడు చిత్రం తర్వాత శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో ఇక ఈ చిత్రం ఎంతటి సంచలనాలకు కేంద్రబిందువుగా మారనుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: