హీరోగా పరిచయమై తరువాత కారెక్టర్ అర్టిస్ట్ గా స్థిరపడిన నటుడు శరత్ బాబు. జులై 30, 1951లో అమదాలవలసలో జన్మించారు. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. సినిమాల కోసం ఆయన పేరును మార్చుకున్నారు. 1973లో వచ్చిన రామరాజ్యం సినిమాతో ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి కథానాయకుడిగా, ప్రతి కథానాయకుడిగా, తండ్రిగా అనేక పాత్రల్లో నటించారు. శరత్ బాబు సినిమా రంగానికి వచ్చిన కొత్తలోనే తనకంటే 4 సంవత్సరాలు పెద్దదైన నటి రమాప్రభను వివాహం చేసుకున్నారు. పధ్నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తరువాత విడిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: