ఇటు తెలుగులో, అటు తమిళంలోనూ స్నేహ చెప్పుకోదగ్గ సినిమాల్లోనే నటించింది. పేరున్న హీరోలతోనే యాక్ట్ చేసింది. అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా, స్నేహ ఇటీవలే నటుడు ప్రసన్నను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి స్నేహ సుడితిరిగిందని తమిళ మీడియా అంటుంది. సినిమా ఛాన్సులు సంగతి ఏలా ఉన్నా స్నేహకు వాణిజ్య ప్రకటనల అవకాశాలు బాగా వస్తున్నాయట. ప్రముఖ వాణిజ్య సంస్థలు తమ ప్రచారం కోసం స్నేహ దంపతులను సంప్రదిస్తున్నాయి. అలాగే పారితోషకాన్ని కూడా భారీగానే ఇస్తున్నాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: