ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే మాస్‌కి పండ‌గే. అదిరిపోయే డైలాగులు, స్టైలింగ్ అన్నీ మాస్‌కి ప‌ట్టేసేవే. అయితే.. త్రివిక్ర‌మ్ మాత్రం ప‌వ‌న్‌ని క‌ల్యాణ్ ని మ‌రీ క్లాస్‌గా చూపిస్తున్నార‌ని స‌మాచారం. జ‌ల్సాలో అన్ని వ‌ర్గాల వారినీ మెప్పించే అంశాలుంటే... కొత్త సినిమాలో క్లాస్‌ప్రేక్ష‌కుల‌కు ప‌ట్టాభిషేకం చేయ‌బోతున్నాడ‌ట‌. అందుకే టైటిల్ కూడా అత్తారింటికి దారేది..? కి డిసైడ్ అయ్యాడ‌ట త్రివిక్ర‌మ్‌. అత్తారింటికి దారేది..? ఈ టైటిల్ బ‌య‌ట‌కు పొక్క‌గానే ప‌వ‌న్ అభిమానుల్లో భిన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. స‌ర‌దానే బాగుంది అనేవాళ్లు కొందరైతే, మ‌రీ క్లాస్ ట‌చ్ ఎక్కువైంద‌ని మ‌రి కొంద‌రు ఫీల‌వుతున్నారు. కొంద‌రు మాత్రం... టైటిల్ కొత్త‌గా ఉంద‌ని సంబ‌ర‌ప‌డుతున్నారు. సినిమా బాగుంటే చాలు.. టైటిల్‌ది ఏముంది లెండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: