జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త ఉషారు లో ఉన్నాడు. ‘బాద్ షా’ విజయం ఇచ్చిన విజయాన్ని అస్వాదిస్తూనే భవిష్యత్ లో తనకు ఎలాంటి ఇబ్బందులు, అవరోధాలు ఎదురవ్వకుండా స్కెచ్ వేస్తున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ అనే పేరు ఎంత శక్తివంతమయ్యిందనే విషయం ఆ పేరు పెట్టుకున్న జూనియర్ కు ఇంకొకరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పుడు ‘ఎన్టీఆర్’ అనే పేరు తనకొక్కడికే చెందేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వెళ్లుతున్నాడు. బాద్ షాలో ‘నా పేరు ఎన్టీఆర్.. దానికో చరిత్ర ఉంది’ అంటూ అదిరిపోయే డైలాగ్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ఇక భవిష్యత్ లో పూర్తి స్థాయి ఎన్టీఆర్ గా ఆవిర్భవించనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ వారసుడుగా జూనియర్ ను చాలా మంది అంగీకరిస్తారు. తాత రూపు రేఖలు, హావభావాలు ఈ మనవుడికి దేవుడు ఇచ్చిన వరాలు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్ ను దున్నెయ్యటానకి జూనియర్ ఎన్టీఆర్ పావులు కదుపుతున్నాడు. ఇందులో బాగంగానే హరీష్ శంకర్ - జూనియర్ ఎన్టీఆర్ కలయికలో రూపొందుతున్న సినిమాకు ‘రావయ్య వస్తావయ్యా..!’ అనే టైటిల్ ప్రకటించారు.  ఆంధ్రులకు రామయ్య అంటే ‘ఎన్టీఆర్’ అనే విషయం తెలిసిందే. రాముడు గా తెలుగు హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ పెద్దాయన అంటే తానేనని గుర్తు చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఈ టైటిల్ ఎంచుకున్నాడు. ఎన్టీఆర్ అనే ఖ్యాతిని పూర్తిగా సొంతం చేసుకోవడానికే ఈ టైటిల్ నిర్ణయించారు.   సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ అంటే తానేని నిరూపించుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో జూనియర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: