సోనియా అగర్వాల్ 7/జి బృందావన్ కాలనీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో పాటు సోనియాకు మంచి గుర్తింపు తీసుకొని వచ్చింది. తరువాత కొన్ని చిత్రాలలో నటించింది. డిమాండ్ లో ఉండగానే దర్శకుడు సెల్వా రాఘవన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అయితే ఆ పెళ్ళి పెటాకులు అవ్వడంతో మళ్ళీ సినిమాల మీద దృష్టి పెట్టింది. ఆమె తమిళంలో నటించిన ఒక సినిమాను ‘కథానాయికి’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ సినిమా పరిశ్రమ నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ సినిమాలో సోనియా అందచందాలు యువతను ఆకట్టుకుంటాయని దర్శక, నిర్మాత లు అంటున్నారు. కాగా, సోనియా అగర్వాల్ జీవిత కథతోనే ఈ సినిమా తెరకెక్కిందని వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: