ఔను... ప్రియ‌మ‌ణి అత‌నంటే ప‌డిచ‌చ్చిపోతోంది. టీవీలో క‌నిపిస్తే చాలు..ఎగిరి గంతేస్తోంది. అత‌ని కోసం ఎక్క‌డికైనా వెళ్లిపోతోంది. ప్రియ‌మ‌ణి మ‌న‌సు దోచుకొంది మ‌రెవ‌రో కాదు.. వెస్టీండీస్ బ్యాటింగ్ వీరుడు క్రిస్ గేల్! ఐపీఎల్‌లో అత‌ని ఉతుకుడు చూసి వీరాభిమాని అయిపోయింది. పూణె తో జ‌రిగిన మ్యాచ్‌లో గేల్ చ‌ల‌రేగి సిక్స‌ర్లు బాదుతుంటే... పుల‌కించిపోయింది. అంతేకాదు... బాల్ బాల్‌కీ అత‌ని ఆట గురించి ట్విట్ చేసింది. గేల్ అద‌ర‌గొట్టేస్తున్నాడు... వావ్‌... సూప‌ర్ అంటూ మురిసిపోయింది. గేల్‌... చిత‌గ్గొట్టేస్తున్నాడు.. అత‌ని ఆటతీరుకు వీరాభిమాని అయిపోయా. క‌ళ్లు త‌ప్ప మ‌రేమీ ప‌నిచేయ‌లేదు... అంటూ గేల్‌పై త‌న అభిమానాన్ని ప్ర‌క‌టించుకొంది. త‌న కోసమే ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తోంద‌ట‌. ప్రియ‌మ‌ణి ఒక్క‌ర్తే కాదు... బాలీవుడ్ భామ‌లు కూడా గేల్ ఆట‌కు బౌల్డ్ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: