పాపులారిటీ కోసం బాలీవుడ్ భామలు హాట్ సంచలనానికి తెరతీస్తారు. తాజాగా బాలీవుడ్ హాట్‌బ్యూటీతో మల్లికా షెరావత్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. తనకు నచ్చే వరుడి కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. తన మిస్టర్‌ రైట్‌ను వెతుక్కోవడానికి ఈ భామ ఓ రియాల్టీ షో చేయబోతోంది. ఇది స్వయంవరం తరహా కాన్సెప్ట్‌తో వస్తున్న ఓ రియాల్టీ షో. 'లైఫ్ ఓకే' ఛానల్లో మల్లికా షెరావత్‌తో డేటింగ్‌ కోసం జరిగే స్వయంవరంలో యువకులు పోటీపడనున్నారు. 'ద బ్యాచిలరేట్‌ ఇండియా- మేరే ఖయాలోంకి మల్లికా' పేరుతో రాబోతున్న ఈ రియాల్టీ షో 'ద బ్యాచిలర్‌' అనే అమెరికన్‌ డేటింగ్‌ గేమ్‌ షో ఆధారంగా రూపుదిద్దుకుంది. ఇది వచ్చే నెల నుంచి ప్రసారమయ్యే అవకాశాలున్నాయి. ఎవరితో డేటింగ్ చేయాలనే విషయమై తనకు కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయని మల్లిక అంటోంది. మంచి చదువు, సంస్కారంతోపాటు స్వయంకృషితో ఎదిగిన వాడు కావాలంటోంది. పనిలో పనిగా ఈ భామ తన మనసులోని మాట బయటపెట్టేసింది. కరణ్‌ జోహార్‌ అయితే తనకు సరైన జోడీ అనిపిస్తోందని.. ఆయనంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది. జీవితంలో ప్రతీ ఒక్కరికీ ఓ తోడు కావాలి. సరైన జోడీని ఎంచుకోవటం చాలా ముఖ్యమైందని అంటోంది. గతంలో రాఖీ సావంత్, రాహుల్ మహాజన్, రతన్ రాజ్‌పుత్ ‘స్వయంవర్’ షోలు చేసి పాపులర్ అయ్యారు. రాహుల్ తెరమీదే డింపీ అనే యువతిని ఎంచుకొని పెళ్లి కూడా చేసుకున్నాడు. తాజాగా మల్లిక ప్రకటించిన స్వయంవరం షో మరోసారి హాట్ టాపిక్ గా మారుతోంది. మరి 36 ఏళ్ల హాట్‌బ్యూటీ రాఖీ కల్పిస్తున్న అవకాశం దక్కించుకోవాలంటే ఆసక్తిగల వారు ప్రయత్నం చేసుకోవచ్చు.. రిజిస్టర్ చేసుకోవాలంటే.. కాల్: 505782717 SMS to 57827 with space space to register రిజిస్ర్టేషన్ చివరి తేది: 31-5-2013

మరింత సమాచారం తెలుసుకోండి: