మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘ఊకొడతారా.. ఉలిక్కిపడతరా..’ సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడు. సినిమా సక్సెస్ మాట ఎలా ఉన్నా.. బాలకృష్ణ అభినయం అందర్నీ అకట్టుకుంటుంది. ఇతరుల సినిమాల్లో బాలకృష్ణ ఇలా అతిధి పాత్రలో కనిపించడం ఇదే మొదటి సారి. (స్వర్గీయ ఎన్టీఆర్ రూపొందించిన కొన్ని సినిమాల్లో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలు పోషించాడు.) కాగా, ‘ఊకొడతారా..’ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి తాను రెడీ ని ప్రకటించాడు. ఈ ప్రకటన సినిమా పరిశ్రమలో అందర్నీ ఆకర్షించింది. బాలయ్య అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. అయితే అభిమానులు ఈ మాటలకు ఆనందిస్తూనే బాలకృష్ణ తన మల్టీస్టారర్ చిత్రాలను నందమూరి ఫ్యామీలి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని వారు కోరుకుంటున్నారు. వాళ్లు కోరుకుంటున్నట్లు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల ఆనందానికి ఆకాశమే హద్దు అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ‘ఎనీ డౌట్స్’ అంటున్నారు అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: