బాలకృష్ణ కొత్త సినిమా గురించి వార్తల్లో నిజం లేదంట. ‘రూలర్’ అనే టైటిల్ తో ఎలాంటి సినిమా తెరకెక్కడం లేదంట. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘రూలర్’ అనే సినిమా రూపొందుతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వార్తలను బోయపాటి ఖండించాడు. అవన్నీ గాలి వార్తలు అని చెప్పాడు. గురువారం నాడు బోయపాటి శ్రీను జన్మదినం. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ త్వరలోనే బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ సినిమా పేరు ‘రూలర్’ కాదని, ఆ సినిమా రాజకీయ నేపధ్యంలో ఉండదని తెలిపారు. తాను ఈ సినిమాలోకి ప్రవేశించి 16 సంవత్సరాలు గడిచిందని, తనకు దర్శకుడిగా ఇది 8వ పుట్టిన రోజని బోయపాటి అన్నారు. తనకు ఇంత గుర్తింపు తీసుకుని వచ్చిన సినిమా పరిశ్రమకు రుణపడిఉంటానని బోయపాటి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: