నంద‌మూరి తార‌క రామారావు... ఈ పేరు వింటే చాలు తెలుగు వారి గుండెలు పుల‌కించిపోతాయి. తెలుగువాడి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాప్తి చేసిన ఘనుడాయ‌న‌. ఎన్టీఆర్ త‌ర‌వాత అంత ఇమేజ్‌, ఆద‌ర‌ణ పొందిన క‌థానాయ‌కుడు ఎవ‌రంటే చిరంజీవి పేరే చెబుతారు. ఎన్టీఆర్‌లా.. అఖండమైన ప్ర‌జాభిమానం సొంతం చేసుకొన్నారు చిరంజీవి. ఇప్పుడు ఎన్ టీవీ సర్వే కూడా ఇదే విష‌యాన్ని రుజువు చేశాయి. భార‌తీయ సినిమా వందేళ్లు పూర్తిచేసుకొన్న సంద‌ర్భంగా ఈ వందేళ్ల‌లో శ‌క్తిమంత‌మైన సినీతార‌ల జాబితా త‌యారు చేసింది. ఇందులో 20 మందికి చోటు క‌ల్పించింది. ఈ జాబితాలో ఎన్టీఆర్ 6వ స్థానం ద‌క్కించుకొన్నారు. ఆ త‌రువాతి స్థానం చిరుదే. ఆయ‌న 15వ స్థానంలో నిలిచారు. వీరిద్ద‌రు మిన‌హా తెలుగు చిత్ర‌సీమ నుంచి మ‌రొక‌రికి స్థానం ద‌క్క‌లేదు. దిలీప్ కుమార్ ఒక‌టో స్థానంలో నిలిచారు. ర‌జ‌నీకాంత్ నాలుగో స్థానం ద‌క్కించుకొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: