ఎమోష‌న‌ల్ డ్రామా పండించాలంటే... బోయ‌పాటి శ్రీ‌ను త‌ర‌వాతే ఎవ‌రైనా! తాను ఎంచుకొన్న క‌థ‌నీ, ఆ క‌థ‌లో నాయ‌కుడినీ ఓ రేంజ్‌లో చూపిస్తాడు. చూడూ... ఒక వైపే చూడూ - అన్నా మ‌న‌కు మాత్రం తాను చెప్పాల‌నుకొన్న ఎమోష‌న్‌ని మాత్రం 360 డిగ్రీల‌లో చూపిస్తాడు. థియేట‌ర్‌కి వ‌చ్చిన ప్రేక్ష‌కుడికి ఫుల్ మీల్స్ పెట్టందే వ‌ద‌ల‌డు! భ‌ద్ర‌, తుల‌సి, సింహా, ద‌మ్ము... యాక్ష‌న్‌, వినోదం, హ్యూమ‌న్ ఎమోష‌న్స్ ఇవ‌న్నీ మేళ‌వించి సినిమా తీయ‌డంలో ఘ‌నాపాటి... బోయ‌పాటి! ఇప్పుడు బాల‌కృష్ణ‌ని రూల‌ర్‌గా చూపించాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ''నా బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకోవాలంటే... ఎడా పెడా సినిమాలు తీసేసేవాడిని. కానీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమాలే తీయాలి. నా వ‌ల్ల మంచి జ‌ర‌క్క‌పోయినా ఫ‌ర్లేదు. ఎవ్వ‌రికీ చెడు జ‌ర‌క్కూడ‌దు. సినిమా అనేది కోట్ల రూపాయ‌ల‌తో న‌డిచే వ్య‌వ‌హారం. వంద‌లాది కుటుంబాలు ఆధార‌ప‌డి ఉంటాయి. మ‌న తొంద‌ర‌పాటు వాళ్ల‌కు శాపం కాకూడ‌దు..'' అని చెప్తారాయ‌న‌. త్వ‌ర‌లో రామ్‌చ‌రణ్‌తో ఓ సినిమా తీయ‌డానికి ప్రణాళిక‌లు వేసుకొంటున్నారు. ఏప్రిల్ 25 ఆయ‌న పుట్టిన రోజు... సో... హ్యాపీ బ‌ర్త‌డే బోయ‌పాటి శ్రీ‌ను. విష్ యు ఆల్ ది బెస్ట్‌.!

మరింత సమాచారం తెలుసుకోండి: