నిన్న గేల్ పిచ్చితో ఊగిపోయింది ప్రియ‌మ‌ణి. సినిమాల కంటే క్రికెట్ ఎక్క‌వన్న‌ట్టు మాట్లాడింది. ఇప్పుడు శ్రుతిహాస‌న్ కూడా ప్రియ‌మ‌ణి బాట‌లోనే న‌డుస్తోంది. క్రికెట్‌పై పిచ్చి ప్రేమ పెంచుకొంటోంది. అయితే త‌న ఫేవ‌రెట్ మాత్రం చెన్నై జ‌ట్టేన‌ట‌! ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ధోనీ టీమ్ క‌ప్పు గెల‌వాల‌ని కోరుకొంటోంది. చెన్నై ఆడే ప్ర‌తి మ్యాచ్ చూస్తోంద‌ట‌. ధోనీ నాయ‌క‌త్వం అదుర్స్ అనీ.... ధోనీ ఎలాంటి జ‌ట్టుతో అయినా అద్భుతాలు సృష్టిస్తాడ‌ని కితాబుల మీద కితాబులు ఇచ్చేస్తోంది. రైనా, జడేజా, అశ్విన్‌లాంటి స్టార్ ఆట‌గాళ్లున్న తమ జ‌ట్టు త‌ప్ప‌కుండా క‌ప్పు గెలుచుకొంటుంద‌ని జోస్యం చెబుతోంది. మ‌రి చెన్నై క‌ప్పు గెలిస్తే ధోనీ సేన‌కు ఏమిస్తుందో ...???

మరింత సమాచారం తెలుసుకోండి: