విక్టరి వెంకటేష్ సినిమా కదా అని ఆశతో వెళ్లే ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది షాడో సినిమా. ఒక సినిమా విజయానికి కావాల్సిన అన్ని రకాల మసాలను గుప్పించినా వాటి సరిగా ఉపయోగించుకో లేక బాక్సాఫీస్ ముందు బార్లాపడిపోయింది.

పగ, ప్రతీకారం ప్రధాన కథాంశంగా పాతదనపు మూసతో సస్పెన్స్, కామెడి, ఉత్కంఠ, ఆతృత వంటివేవి లేకుండా సినిమా అంత బోర్ కొట్టించారు. కామెడి బాగా దట్టించాలని చూసినప్పటికి కేవలం ఒక్క ఎంఎస్ తోనే సరిపెట్టి సపోర్టివ్ గా కామెడి పండించడానికి మరే హాస్యనటున్ని పెట్టకపోవడంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. తాగుబోతు రమేష్ ను పెట్టినప్పటికి రెండే సార్లు చూపించి రమేష్ పాత్రకు అన్యాయం చేసారు.  హీరోకు ఉండాల్సినంత గెటప్, డ్రెస్సింగ్, అప్పియరెన్స్ లేకుండా వెంకటేష్ వేషాన్ని ఫట్ అన్సించారు. రక్తికట్టించే డైలాగులు, నవ్వులు కురిపించే మాటలు, రోమాలు నిలుచునేలా విలన్లకు దడపుట్టించే మాటల తూటాలు ఏమి లేకుండా అంతా చప్పగా నడిపించారు.

హీరోయిన్ తాప్సి ఎవరు, ఆమె ఊరు, తల్లిదండ్రులు ఎవరు అన్నది ఎక్కడా చూపించలేదు. కేవలం హీరో తో కలసి చిందులేయడం, పాటల్లో కాస్తా రొమాన్స్ ను చూపించడం కోసం పెట్టారు. మాఫియా చేతిలో తండ్రి హత్యకు గురైతే అది కళ్లారా చూసిన హీరో వెంకటేష్ వారందరిని హతం చేయడానికి నడిపిన కథ, సీన్లు, విడిపోయిన చెల్లి, తల్లి కనిపించినప్పుడు పుట్టించాల్సిన సెంటిమెంట్ లో విఫలమయ్యారు.

వారికి తానే అన్న, కొడుకు అని తెలియకుండా చివరి వరకు ఉంచాల్సిన సస్పెన్స్ ను అలా క్రియేట్ చేసి ఆ మజా ఏమి లేకుండానే తుస్సుమనిపించారు. హీరో బావగా శ్రీకాంత్ లాంటి ఇమేజ్ స్టార్ ని పెట్టి అంతకు తగ్గట్టుగా క్రియేట్ చేయలేక పోయారు.  మైండ్ దెబ్బతిని చిన్నపిల్లాడిలా మారిన వెంకటేష్ ఎంతో నవ్వులు కురిపిస్తాడనుకుంటే ఆపాత్రకు ఏమాత్రం న్యాయం చేయలేదు వెంకి. పైగా సాగదీసిన ఆసన్నివేశాలు సినిమాలో అనవసరం అన్పించేలా చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించారు.

ఓటైటిల్ సాంగ్, నాటినాటి గాల్ అన్న రెండు పాటలు కాస్తా ఫరవాలేదనిపించినా మిగిలినవి బాగాలేకపోగా వాటికోసం కావాలని సీన్ క్రియేట్ చేసి పెట్టడం చూసినోళ్లకు చిర్రెక్కిస్తుంది. ఎంతో అదరగొడుతుందనుకున్న క్లయిమాక్స్ ఏమి లేకుండా సప్పగా ముగియడంతో ప్రేక్షకుడు ఓ నిట్టూర్పు విడిచి విశ్రమిస్తాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: