కొన్ని సంఘటనలు కొంత మందికి విషాదంగా మారితే మరికొంత మందికి సంతోషం కలిగిస్తాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగింది. తమిళనటుడు శ్రీనివాసస్ ను అరెస్ట్ చేసారనే వార్త ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అభిమానులకు సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ శ్రీనివాసన్ అనే తమిళ నటుడు పవన్ కళ్యాణ్  అభిమానులకు చికాకు తెప్పించేవాడు. 

పవన్ కళ్యాణ్ కు ‘పవర్ స్టార్’ అనే బిరుదు ఉన్న సంగతి తెలిసిందే. పవన్ నటన, అతని స్టైల్ కు ‘పవర్ స్టార్’ అనే బిరుదు సరిగ్గా సరిపోతుందని పవన్ అభిమానులు సంతోషపడే వారు. అయితే తమిళ నాట శ్రీనివాసన్ కూడా ఇదే ‘బిరుదు’ను తగిలించుకున్నాడు. తాను ‘పవర్ స్టార్’ అంటూ ప్రచారం చేసుకునేవాడు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు చికాకు తెప్పించేది. ఇప్పడు శ్రీనివాసన్ అరెస్ట్ చేయడం వారికి సంతోషం కలిగిస్తోంది.

విషయంలోకి వెళ్తే... ప్రముఖ తమిళ నటుడు, 'పవర్ స్టార్' శ్రీనివాసన్ ను శుక్రవారం ఉదయం చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన పీఎస్ రంగనాథన్ అనే వ్యక్తి చెన్నై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంవల్లే శ్రీనివాసన్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. వెంటనే అతడిని రిమాండుకు పంపామన్నారు. రూ.20 కోట్ల సెక్యూర్ లోన్ వ్యవహారంలో నటుడు తననుంచి రూ.50 లక్షలు కమిషన్ తీసుకున్నట్లు రంగనాథన్ ఆరోపించాడని చెప్పారు. అయితే లోన్ వచ్చాక తనకు డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడని బాధితుడు చెప్పినట్లు వివరించారు. ఇంకా పలువురిని శ్రీనివాసన్ మోసం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పలు తమిళ చిత్రాల్లో నటించిన శ్రీనివాసన్ తనకు తానే 'పవర్ స్టార్' అనే బిరుదు తగిలించుకున్నారు.

ఇప్పుడు ‘పవర్ స్టార్’ ను అరెస్ట్ చేయడం పవన్ కళ్యాణ్ అభిమానులకు హ్యపీగా ఉంది. ‘పవర్ స్టార్’ పీడ వదిలిందని సంబరపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: