అల్లు అర్జున్ సినిమాల‌కు ఫారెన్‌లో మంచి గిరాకీ!  జులాయిగా అక్క‌డ అద‌ర‌గొట్టేశాడు. ముఖ్యంగా అమెరికాలో హ‌వా సృష్టించాడు. ఇప్పుడు ఇద్ద‌ర‌మ్మాయిల‌తో సినిమాకీ ఓవ‌ర్సీస్‌లో మంచి రేటు గిట్టుబాటు అయ్యింది. ఈ సినిమా విడుద‌ల‌కు నెల రోజుల ముందే అక్క‌డ మంచి బిజినెస్ జ‌రిగింది. ఈ సినిమాని ఫ్యాన్సీ రేటుకు అమ్మేశార‌ట‌.

అల్లు అర్జున్ క్రేజ్‌, పూరి సినిమాల‌పై ఉన్న న‌మ్మ‌కంతో ఈ సినిమా హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు కొనుక్కొన్నార‌ట‌. ఓవ‌ర్సీస్ ఇచ్చిన కిక్‌తో బండ్ల గ‌ణేష్‌లో ఉత్సాహం పెరిగింది. టాలీవుడ్‌లో ఈసినిమా భారీ మొత్తాల‌కు అమ్ముకోవాల‌ని... గ‌ణేష్ ప్లాన్ చేస్తున్నాడు. బాద్‌షాతో లోటుగా ప‌డిపోయిన‌... గ‌ణేష్ ఈ సినిమాతో అయినా గ‌ట్టెక్కుతాడో లేడో మరి.

బాద్‌షా వ‌ల్ల న‌ష్ట‌పోయిన బ‌య్య‌ర్లు.. ఇద్ద‌ర‌మ్మాయిల‌ను త‌క్కువ రేటుకు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: