1000 అబద్దాలు సినిమాపై ప్రేక్ష‌కుల ఫోక‌స్ వీలైనంత ఎక్కువ ప‌డేలా జాగ్ర‌త్త‌లు తీసుకొంటున్నాడు తేజ‌. టైటిల్ పై ఇప్ప‌టికే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. టీజ‌ర్ కూడా బాగానే ఉంది. ఈమ‌ధ్య సింగిల్ టేక్‌లో పాటంతా తీసేసి... ఆక‌ర్షించాడు. ఇప్పుడు మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నాడు. తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఉన్న సినీ జంట‌ల‌పై ఓ గీతాన్ని తెర‌కెక్కిస్తాడ‌ట‌. అందుకు స‌న్నాహాలు కూడా చేసుకొంటున్నాడు.

అంటే.. నాగార్జున‌-అమ‌ల‌, శ్రీ‌కాంత్‌-ఊహా ఈ టైపు జంట‌ల‌పై సాంగ్ తీస్తాడ‌న్న‌మాట‌. వింటుంటే వెరైటీగా ఉంది. మరి వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: