తెలుగు ప‌రిశ్ర‌మ‌లో నెంబ‌ర్ వ‌న్ స్టార్ ఎవ‌రు?  ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం గురించి అంత త‌డుముకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. అంద‌రిదీ ఒక‌టే మాట‌... మహేష్  నెంబ‌ర్ వ‌న్‌! ఇప్పుడు మ‌రో విష‌యంలోనూ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల కోసం అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకొంటున్న ద‌క్షిణాది క‌థానాయ‌కుల జాబితాలో మ‌హేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ తార‌ల‌కూ, క్రికెట్ స్టార్ల‌కు ఏమాత్రం తీసిపోకుండా రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తున్నాడ‌ట‌.

దూకుడు, బిజినెస్‌మేన్‌, సీత‌మ్మ వాకిట్లో... సినిమాల‌తో మ‌హేష్ క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఈ  క్రేజ్‌ని వాణిజ్య సంస్థ‌లుక్యాష్ చేసుకోవాల‌ని భావిస్తున్నాయి. అందుకే మ‌హేష్ అడిగినంత సొమ్ము ఇవ్వ‌డానికి వాళ్లంతా ముందుకొస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే మ‌హేష్ మ‌రికొన్ని సంస్థ‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నాడు.

ప్రిన్స్ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే!

మరింత సమాచారం తెలుసుకోండి: