రాష్ట్ర్రంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి.  త్వ‌ర‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి కాబ‌ట్టి ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోనికి మారే జంపు జిలానీలు ఎక్కువ‌గా క‌నిపిస్తారు. పార్టీ జండాలు భుజాన వేసుకొని.... ప్ర‌చారానికి మేము కూడా వ‌స్తాం అనేవాళ్లూ ఉంటారు. సినీ గ్రామ‌ర్ కోసం పార్టీల‌న్నీ అర్రులు చాచుతాయి. కింగ్‌నాగార్జున కూడా త్వ‌ర‌లో ఓ పార్టీలో చేర‌బోతున్న‌ట్టు గ‌త కొంత‌కాలంగా పుకార్లు న‌డిచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొంటున్న‌ట్టు చెప్పుకొచ్చారు.

అయితే, వీట‌న్నింటినీ తోసిపుచ్చారు నాగార్జున‌. త‌న‌కు ఏ పార్టీలోనూ చేరాల‌ని లేద‌ని, అస‌లు రాజ‌కీయాలంటే ఎలాంటి ఆస‌క్తి లేద‌ని తేల్చిచెప్పేశారు. ఇలా... హ్యీపీగా ఉంటున్నా.. ఉండ‌నివ్వండి... అని మీడియాను కోరుతున్నారు. ''నాన్న‌గారి హ‌యాంలో కూడా ఆయ‌న‌పై ఇలాంటి వార్త‌లే వ‌చ్చాయి.చాలామంది ఒత్తిడి చేశారు. కానీ ఆయ‌న మాత్రం నిశ్చితంగా ఉన్నారు. నేను కూడా అంతే. నాకు తెలిసింది సినిమాలే. అవి దాటి బ‌య‌ట‌కు రాను..'' అన్నారు నాగార్జున‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: