బాలీవుడ్ లో ఇలియానా జోరు చూపిస్తుంది. ‘బర్ఫీ’ తో బాలీవుడ్ వర్గాలను ఆకర్షించిన ఇలియానా అక్కడ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటుంది. తాజాగా సైఫ్ అలీఖాన్ తో నటించే అవకాశాన్ని ఇలియానా దక్కించుకుంది. రాజ్ నిడమూరు, కృష్ణ డికే దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్ నటించే కొత్త సినిమాలో ఇలియానా హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఈ దర్శకులతో ‘గో గోవా గాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తరువాత ఈ కొత్త సినిమా ప్రారంభం అవుతుంది.

కాగా, ఇలియానా ఇప్పటికే అక్షయ్ కుమార్ తో కలిసి నటిస్తుంది. అలాగే ఏక్తా కపూర్ నిర్మించే సినిమాలో నటించడానికి అంగీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: