హిట్లు లేనంత మాత్రానా దర్శకుడు తేజను తక్కువ అంచనా వేయలేం. చిన్న సినిమాలు, కొత్త స్టార్స్ తోనే తన సత్తా చూపించిన దర్శకుడు అతను. ఈ దర్శకుడు తాజాగా 1000 అబద్దాలు అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ లో కొంత మంది స్టార్లు మీద సైటర్లు సంధించనున్నాడు.

ఈ సినిమాలో నాగేంద్రబాబు ఒక సినీ తార పాత్రను పోషిస్తున్నాడు. ఆ పాత్ర పేరు టాల్ స్టార్. ఈ పాత్రతో సినీ తారలపై వ్యంగ్యబాణాలు వేయనున్నాడు దర్శకుడు తేజ.

తేజ మొదట నుంచి కూడా చిన్న తారలతో సినిమాలు రూపొందించాడు. మహేష్ బాబు తో తప్ప ఏ అగ్రహీరోతోనూ చేయలేదు. తేజ ప్రయత్నించినా టాలీవుడ్ అగ్రహీరోలు అతనికి చాన్స్ ఇవ్వలేదు. దీంతో టాల్ స్టార్ పేరుతో కొంత మంది టాలీవుడ్ అగ్రహీరలపై తేజ సైటర్లు సంధించనున్నట్లు చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: