భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. మే 3, 1913న దాదా సాహెబ్ ఫాల్కే రూపొందించిన ‘రాజా హరిశ్చంద్ర’ సినిమా విడుదల కావడంతో భారతీయ సినిమా ప్రయాణం ప్రారంభం అయ్యింది. అలాగే మార్చి 14, 1931న తొలి భారతీయ టాకీ సినిమా ‘ఆలం ఆరా’ విడుదల అయ్యింది. తొలి తెలుగు టాకీ సినిమా కూడా ఇదే సంవత్సరం విడుదల అయ్యింది.

తొలి తెలుగు టాకీ ‘భక్త ప్ర్లహ్లద’  1931, సెప్టెంబర్ 15న విడుదల అయ్యింది. నాటక కంపనీ సురభి చెందిన కళాకారులతో హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. పూర్ణా మంగరాజు చిత్ర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో లీలావతిగా నటించిన సురభి కమలాబాయి తెలుగు తెర తొలి కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా కోసం గీతాలు రాసిన చందాల కేశవదాసు తొలి గీత రచయితగానూ, స్వరాలు కూర్చిన హెచ్.ఆర్.పద్మనాభశాస్ర్తి తొలి తెలుగు సంగీత దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదండీ తొలి తెలుగు సినిమా కథ..!

మరింత సమాచారం తెలుసుకోండి: