తెలుగు సినిమా చరిత్రలో అత్యుత్తమ నటుడు ఎవరు? ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి.. వీరెవరూ కాదు. ఉత్తమ నటుడు సోమయాజులు మాత్రమే అంటూ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. భారతీయ సినిమా వందేళ్ల పండగ జరుపుకుంటున్న సందర్భంగా  ఫోర్బ్స్ మ్యాగజైన్ పాతిక సినిమాల్లోని నటులను ఎంపిక చేసింది.

'25 గ్రేటెస్ట్ యాక్టింగ్ ఫర్ఫామెన్సెస్ ఆఫ్ ఇండియన్ సినిమా' పేరిట ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు సినిమా నుంచి ఒక్క జేవీ సోమయాజుకే ఆ స్థానం దక్కింది. 'శంకరాభరణం' సినిమాలోని నటనకు ఈ గుర్తింపు లభించింది. తమిళం నుంచి నాలుగురికి ఈ ఖ్యాతి దక్కింది.

'ఫోర్బ్స్' జాబితా:

తమిళం నుంచి..
శివాజీ గణేశన్ (పరాశక్తి),
రజనీకాంత్ (తిల్లు ముల్లు),
కమల్ హాసన్ (మహానది),
రేవతి (మౌనరాగం),

కన్నడ నుంచి..
రాజ్ కుమార్ (బంగారద మనుష్య),
మలయాళం నుంచి మమ్ముట్టి (మథిలుకల్), మోహన్ లాల్ (భారతం),
మరాఠీ నుంచి ఉపేంద్ర లిమాయే (జోగ్వా), నిలు ఫులే (సామ్నా)

బెంగాలీ నుంచి..
సుప్రియా చౌదరి (మెగే దఖా తార),
సౌమిత్రి చటర్జీ (జిందర్ బండి),
చాబీ బిశ్వాస్ (జల్ సాగర్),
ఉత్తమ్ కుమార్ (నాయక్),
అనన్య చటర్జీ (అబోహోమాన్),

హిందీ నుంచి.. అమితాబ్ (దీవార్), అమ్జాద్ ఖాన్ (షోలే). బల్రాజ్ సహ్నానీ (గరం హవా), ఉట్పల్ దత్ (భూవన్), సంజీవ్ కుమార్ (అంగోర్), దిలిప్ కుమార్ (దేవదాస్), నసీరుద్దీన్ షా (స్పర్శ్) నుతన్ (బందిని), స్మిత పాటిల్ (మిర్చిమసాలా), రేఖ (ఉమ్రావ్ జాన్)

మరింత సమాచారం తెలుసుకోండి: