న‌టుడిగా ద‌ర్శ‌కుడిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు ర‌విబాబు. మెగాఫోన్ ప‌ట్టిన త‌ర‌వాత బ‌య‌ట సినిమాల‌కు చేయ‌డం బొత్తిగా తగ్గించేశారు. మ‌న‌సుకు న‌చ్చిన సినిమానే చేస్తున్నారు. ఇప్పుడాయ‌న తండ్రిగా మారారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం అంత‌కు ముందు ఆ త‌ర‌వాత‌. ఈ సినిమాలో క‌థానాయిక త‌ల్లిగా మ‌ధుబాల న‌టిస్తోంది. మ‌ధుబాల భ‌ర్త పాత్ర‌లో ర‌విబాబు క‌నిపిస్తారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ అల్ల‌రి పాత్ర‌ల‌కే ప‌రిమితమైన ర‌విబాబు తొలిసారి.. హుందాత‌నం కూడిన పాత్ర చేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌.

మ‌రి ర‌విబాబు-మ‌ధుబాల జంట‌ను ప్రేక్ష‌కులు ఎలా స్వీకరిస్తారో మరి?

మరింత సమాచారం తెలుసుకోండి: