ట్విట్ట‌ర్ డ‌బ్బా... అంద‌రినీ తెగ ఆక‌ర్షించేస్తోంది. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడుకోవాల‌ని చూసిన వారికి ట్విట్ట‌ర్ ఓ అద్భుత నిధిలా క‌నిపిస్తోంది. త‌మ సొంత ప్ర‌చారం చేసుకొంటూ.. త‌మ అభిప్రాయాల‌ను న‌లుగురికీ పంచ‌డానికి దీనిని ఓ వేదిక చేసుకొంటున్నారు. ఇప్పుడు ప్ర‌ణీత కూడా ఈ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ మాయలో ప‌డిపోయింది.

రోజూ గంట‌ల త‌రబ‌డి... ట్విట్ట‌ర్‌కి అంకిత‌మైపోతోందట‌. ఈ విష‌యం స్వ‌యంగా త‌నే చెప్పింది. ''ట్విట్ట‌ర్ గురించి ముందు నాకు తెలీదు. టైమ్ వేస్ట్ అనుకొనేదానిని. దాని వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకొంటున్నా. నా భావాలను న‌లుగురికీ చెప్పుకోవ‌డానికి ట్విట్ట‌ర్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతోంది. అంతే కాదు... కొత్త కొత్త ప‌రిచ‌యాలూ జ‌రుగుతున్నాయి. అవ‌న్నీ మ‌న మంచికే. ఏదైనా ప‌రిధుల్లో ఉప‌యోగించుకొంటే మంచే జ‌రుగుతుంది. దాటితేనే ప్ర‌మాదం'' అని హిత‌బోధ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: