వ‌రుస రెండు హిట్లు ఏ హీరోకైనా స్టార్ డ‌మ్‌ని తీసుకొస్తాయి. క్రేజ్‌తో పాటు పారితోషికం కూడా అమాంతం పెరుగుతుంది. నితిన్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమాల‌తో నితిన్ స్టామినా ఏమిటో తొలిసారి సినీ జ‌నాల‌కు తెలిసింది. గుండెజారి... దాదాపుగా రూ.20 కోట్లు వ‌సూలు చేయ‌నుంద‌ని చెప్పుకొంటున్నారు. ఆ సినిమాకి అయిన ఖ‌ర్చు ఎనిమిది కోట్లే. అంటే... ప‌న్నెండు లాభం అన్న‌మాట‌. త‌మిళ హ‌క్కులు త‌న ద‌గ్గ‌రే ఉంచుకొన్నారు నిర్మాత‌. అంటే.. ఆ లాభం మరింత పెరిగే అవ‌కాశం ఉంది.

దీన్ని దృష్టిలో పెట్టుకొని... నితిన్ త‌న త‌ర‌వాత సినిమాల‌కు రేట్లు పెంచేస్తున్నాడు. త‌న పారితోషికాన్ని అమాంతం మూడు రెట్లు పెంచాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్‌లో టాక్‌!  అంతేకాదు... తాను సూచించిన సాంకేతిక నిపుణుల‌నే తీసుకోమ‌ని డిమాండ్ చేస్తున్నాడ‌ట‌.

హిట్టు ప‌డ‌గానే ఎలా మారిపోయాడో చూడండి.!

మరింత సమాచారం తెలుసుకోండి: