స్టైల్‌, ఇమేజ్‌, డాన్సింగ్‌, యాక్టింగ్‌.... ఈ విష‌యాల్లో పేరు పెట్ట‌లేని హీరో.. మ‌హేష్‌బాబు. న‌ట‌న‌లో ఈజ్‌.. కొల‌వ‌డం క‌ష్టం. ఎలాంటి పాత్ర‌లో అయినా ఇట్టే దూరిపోతాడు. మురారి, నిజం, అర్జున్, అత‌డు, పోకిరి... ఇలా ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో!  అలాంటి మ‌హేష్ కూడా ఓ స‌న్నివేశం చేయ‌లేక‌.... చ‌తికిల‌పడ్డాడు. చిన్న సీన్ చేయ‌డానికి ఏకంగా 40 టేకులు తీసుకొన్నాడ‌ట‌. మ‌హేష్ ప్ర‌స్తుతం సుకుమార్ దర్శక‌త్వంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా కోసం మ‌హేష్‌... బైక్ పైనుంచి స్టైలీష్‌గా తీసే స‌న్నివేశం తెర‌కెక్కించారు. ఫైన‌ల్ షాట్ ఓకే కావ‌డానికి మ‌హేష్ ఏకంగా 40 టేకులు తీసుకొన్నాడ‌ట‌.

మ‌హేష్ ఎంత బాగా చేసినా.. సుకుమార్‌కి కావ‌ల్సిన అవుట్ పుట్ రాక‌పోవ‌డంతో వ‌న్‌మోర్‌, వ‌న్‌మోర్ చెబుతూనే ఉన్నాడు సుకుమార్‌. దాంతో ఆ షాట్ పూర్తిచేయ‌డానికి 40 టేకులు అవ‌స‌ర‌మ‌య్యాయి. సుకుమార్ నిక్క‌చ్చిత‌త్వానికి మ‌హేష్ కూడా మురిసిపోయాడ‌ట. ఇదంతా సినిమా బాగా రావ‌డానికే క‌దా... అనుకొని ద‌ర్శ‌కుడికి ఏం కావాలో.. అది ఇచ్చేవ‌ర‌కూ క‌ష్ట‌ప‌డ్డాడ‌ట‌. అందుకే మ‌రి అంత మంచి న‌టుడ‌య్యాడు మ‌హేష్‌..

మరింత సమాచారం తెలుసుకోండి: