నాగ‌చైత‌న్య సినిమా ఆటోన‌గ‌ర్ సూర్య దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డిపోయింది. ఈ సినిమాని నాగార్జున ఒడ్డున ప‌డేస్తాడ‌నుకొంటే ఆయ‌న కూడా ఈ సినిమాని లైట్ తీసుకొన్నారు. మీ అబ్బాయి ఆటోన‌గ‌ర్ సూర్య ఎప్పుడు విడుద‌ల అవుతుంది?  అని అడిగితే ఏం చెప్పాడో తెలుసా?  

``నేను ఆ సినిమా గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశా. తడాఖా వ‌స్తుంది క‌దా?  ఈ సినిమా బాగా ఆడుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. మ‌నం సినిమాలోనూ అత‌నికి మంచి పాత్రే ద‌క్కింది అన్నాడు. అంటే అర్థం ఏమిటి?  ఆటోన‌గ‌ర్ సూర్య‌... వ‌దిలేస్తున్నా అనే క‌దా?  స్వ‌యంగా నాగార్జునే వ‌దిలేస్తే... ఆ సినిమా ప‌రిస్థితి ఏమిగానూ?  అన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా ఆగిపోవాల్సిందేనా?  త‌డాఖా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం నాగ్‌కి ఉంది కాబ‌ట్టి ఇలా అంటున్నాడు. ఆ సినిమాపై కూడా అనుమానం ఉంటే... ఇంత ధైర్యంగా బ‌దులిచ్చేవాడా?  

ఇప్పటికైనా మించిపోయింది లేదు. చైతూ కెరియ‌ర్‌ని ద‌గ్గ‌రుండి చూసుకొంటే... కొన్ని త‌ప్పులైనా స‌రిదిద్దుకొనే వీలుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: