మ‌ల్లికా శెర‌తావ‌త్ అంటేనే హాట్ భామ‌. స‌రికొత్త అందాలు బాలీవుడ్‌లో ఎన్ని ఎంట‌ర‌వుతున్నా ఆమె క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌త్తెక్కించే స్టార్ ఎవ‌రంటే... బాలీవుడ్‌లో ఇప్ప‌టికీ మ‌ల్లిక పేరే చెబుతారు. అయితే ఈ ట్యాగ్‌లైన్‌ని వీలైనంత త్వ‌ర‌గా చెరుపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది మ‌ల్లిక‌. న‌టిగా గుర్తింపు తెచ్చుకోవాల‌ని ఇన్నాళ్ల‌కు అనిపిస్తోంద‌ట‌.

సెక్సీ సింబ‌ల్ అనుకొంటే యువ‌త‌రం మాత్ర‌మే నా సినిమాల‌ను చూస్తుంది. మంచి న‌టి... అనే పేరు వ‌స్తే అంద‌రూ నా సినిమాల్ని చూస్తారు. ఎక్కువ కాలం ప్రేక్ష‌కుల‌కు గుర్తుంటాం. అందుకే ఆ త‌ర‌హా పాత్ర‌ల కోసం ఎదురుచూస్తున్నా. ద‌ర్టీ పాలిటిక్స్ సినిమాలో అలాంటి పాత్ర‌నే పోషిస్తున్నా. లార్జ‌న్ దెన్ లైఫ్ పాత్ర కాదిది. స‌మాజంలో అనునిత్యం క‌నిపించే మ‌న‌స్తత్వాలే తెర‌పై నా పాత్ర‌లో ప్ర‌తిబింబిస్తాయి.. అని చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: