తెలుగు అమ్మాయి మంచు లక్ష్మీ ప్రసన్న మరో ఘనత సాధించింది. హాలీవుడ్ లో నిర్మించే సినిమాలో ఎంపిక అయ్యింది. ‘బాస్మతి బ్లూస్’ అనే హాలీవుడ్ సినిమాలో ఎంపిక అయ్యింది. డాన్ బెరాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కు ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. డోనాల్డ్ సుదర్లాండ్, టైనీ డాలీ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

మోహన్ బాబు కుమార్తెగా ప్రేక్షకులకు పరిచయం అయ్యిన లక్ష్మీ ప్రసన్న తొలి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకుంది. విలన్ పాత్రకు నంది అవార్డు గెలుచుకున్న మొదటి మహిళగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాకు ఎంపిక అయ్యి తన సత్తా మరో చూపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: