అరుంధతి సినిమాతో తెలుగు వారి హృదయాల్లో తిష్ట వేసిన హీరోయిన్ అనుష్క. తరువాత కూడా అనుష్క తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకర్సించే అనుష్కలో ఒక లోటు ఉంది.
తన నటన, అందచందాలతో  అనుష్క ఎంతగా మెప్పించినా కంఠ స్వరం మాత్రం అమెది కాదు. ఇప్పటి వరకూ అనుష్క నటించిన అన్ని సినిమాలకు వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించారు. అయితే తాజాగా అనుష్క ఆ లోటు గా తీర్చనుంది. అనుష్క కొత్త సినిమాలో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనుంది.

అనుష్క,  ఆర్య జంటగా సెల్వారాఘవన్ దర్శకత్వంలో ‘ఇరండం ఉలగం’ అనే తమిళ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను తెలుగులో ‘బృందావనంలో నందకుమారుడు’ అనే పేరుతో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకు అనుష్క స్వయంగా డబ్బింగ్ చెప్పుకోనుంది. దీంతో మనం అనుష్క గొంతు వెండితెర మీద మొదటిసారిగా విననున్నాం.

కాగా, ఈ సినిమాలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుంది. గిరిజన అమ్మాయిగానూ, అధునిక యువతిగానూ అనుష్క ఈ సినిమాలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: