ఈవీవీ త‌న‌యుడిగా అడుగుపెట్టిన ఆర్య‌న్ రాజేష్‌కి స‌రైన విజ‌యాలు ద‌క్క‌లేదు. ఎవ‌డిగోల వాడిదే.. బాగానే ఆడినా ఆక్రెడిట్ హాస్య‌న‌ట బృందానికే ద‌క్కింది. ఆ సినిమాలో ఆర్య‌న్ చేసిందీ ఏమీ లేదు. త‌మ్ముడు న‌రేష్ మాత్రం మిమినం గ్యారెంటీ హీరోగా స్థిర‌ప‌డిపోయాడు. పెళ్ల‌య్యాక ఆర్య‌న్ సినిమాలవైపు అస్స‌లు చూళ్లేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత మ‌ళ్లీ మేక‌ప్ వేసుకొని.. త‌మ్ముడికి పోటీ ఇస్తున్నాడు.

ఆర్య‌న్ హీరోగా ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకొంటోంది. ర‌చ‌యిత దివాక‌ర్‌బాబు త‌న‌యుడు శ్రీ‌క‌ర‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల ఊటీలో కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. వ‌రుస ఫ్లాప్‌ల‌తో క‌నుమ‌రుగైన ఆర్య‌న్‌... మ‌ళ్లీ నెగ్గుకు వ‌స్తాడా?  త‌న ప్ర‌తాపం చూపిస్తాడా?  ఏమో మరి!!

మరింత సమాచారం తెలుసుకోండి: