తెలుగులో క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకొన్న క‌థానాయిక అంజ‌లి! సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా త‌ర‌వాత మ‌రో సౌంద‌ర్య వ‌చ్చింద‌నుకొన్నారు. అయితే ఆ అంజ‌లి ఇప్పుడు రూటు మార్చి.. హాట్‌బాట ప‌ట్టింది. బ‌లుపులో చాలా గ్లామ‌ర‌స్‌గా క‌నిపించింద‌ట‌. అంతే కాదు... ఇప్పుడు సింగ‌మ్ 2లో ప్రత్యేక గీతంలోనూ న‌టించిద‌ట‌. ఇదేదో దర్శ‌కుడిపైనో, సూర్య‌పైనో ఉన్న మ‌మ‌కారం కాదు. పారితోషికం న‌చ్చి.. ఒప్పుకొంద‌ట‌.

అంజ‌లి లాంటి క‌థానాయిక‌ కూడా ఐటెమ్ గాళ్‌గా మారిపోతే ఇక చేసేది ఏముంది?  సీత‌మ్మ త‌ర‌వాత‌.. అంజ‌లి పారితోషికంలోనూ భారీ మార్పులు వ‌చ్చాయి. ఒక్క‌సారిగా డ‌బుల్ చేసింద‌ట‌. అంతేకాదు... మీరు ఎలాగైనా చూపించుకోండి.. అంటూ ఆఫ‌ర్ ఇస్తుందంట‌.

పాపం... అంజ‌లి ఇలా మారిపోయిందేమిటి?  అంతా క్యాష్ మ‌హిమ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: