బాహుబ‌లికి రంగం సిద్ధం అవుతుంది. సెట్స్‌పైకి వెళ్ల‌డానికి అన్నివిధాలా.... ప‌క్కా ప్ర‌ణాళికలు వేసుకొంటోంది. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

ఈ సినిమాలో ప్ర‌భాస్ ఫృద్వీరాజ్‌గా క‌నిపిస్తాడ‌ట‌. ఈ క‌థ వెయ్యేళ్ల క్రితం నాటిద‌ట‌. ఈ సినిమాలో భారీ ఎత్తున యుద్ధాలు ఉంటాయ‌ట‌. అవ‌న్నీ విజువ‌ల్ ఎఫెక్ట్స్‌లో తీర్చిదిద్దుతార‌ట‌. ప్ర‌భాస్‌-రానా మ‌ధ్య జరిగే ఓ పోరాట ఘ‌ట్టం ఈ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుంద‌ట‌. దాని కోసమే కొన్ని కోట్లు ఖ‌ర్చుపెడుతున్నారట‌.

ఇవ‌న్నీ రెబ‌ల్ స్టార్ ఫ్యాన్స్‌కి ఉత్సాహం క‌లిగించే విష‌యాలే! షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుందా?  ఎప్పుడు విడుద‌ల అవుతుంది?  అని చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ సినిమా విడుద‌ల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: