షాడోకి ఏం జ‌రిగిందో ఇప్పుడు గ్రీకువీరుడుకీ అదే జ‌రుగుతోంది. షాడో నెగిటివ్ టాక్‌ల మ‌ధ్య వ‌చ్చి... ఫ్లాప్‌గా మిగిలింది. గ్రీకువీరుడు టాక్ కూడా అంత గొప్ప‌గా ఏమీ లేదు. సినిమా చాలా స్లో అని... సెంటిమెంట్ ఎక్క‌వైంద‌ని చెప్పుకొంటున్నారు. మరి.. ఈ టాక్ నాగార్జున బ్రేక్ చేస్తాడా?? 

ఇన్ని మైన‌స్‌ల మ‌ద్య‌.... గ్రీకువీరుడికి ఓ ప్ల‌స్ పాయింట్ ఉంది. ఈ సినిమాతోనే టికెట్లు రేట్లు పెరుగుతున్నాయి. ఏసీ బాల్క‌నీ రేటు... రూ.75ల‌కు చేరింది. ఈ తేడా వ‌సూళ్ల‌లో భారీగా చూపించే అవ‌కాశం ఉంది. గ్రీకువీరుడు ఓ మాదిరిగా ఆడినా.. పెట్టుబ‌డి వ‌చ్చేసే అవ‌కాశాలుంటాయి. టికెట్ల రేట్ల పెంపుద‌ల‌ను నాగ్ స‌మ‌ర్థిస్తున్నాడు. అంతే కాదు... త‌న సినిమాతోనే రేట్లు పెరిగినంద‌కు చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నాడు.

మ‌రి ఈ ప్ల‌స్ పాయింట్‌ని నాగ్‌...వినియోగించుకొంటాడా?  లేడా?  శుక్ర‌వారం వ‌ర‌కూ వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: