అందాల కాజల్ ప్రవర్తన ఇప్పుడు అందరికీ విస్మయం కలిగిస్తుంది. ఏ హీరోయిన్ అయినా పెద్ద హీరోతో పని చేసే అవకాశం కోసం ఎదురుచూస్తుంటుంది. వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకుంటుంది. అయితే కాజల్ మాత్రం వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకునే విధంగా ప్రవర్తిస్తుంది.

విషయానికి వస్తే.. హీరో పవన్ కళ్యాణ్ త్వరలోనే గ్బబర్ సింగ్ -2ను తీయడానికి సిద్దపడుతున్నాడు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందనుంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కాజల్ సంప్రదించారు. అయితే ఈ సినిమాలో నటించడానికి కాజల్ కోటికి పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది. దీంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఎందుకంటే తెలుగు సినిమాల్లో నటించడానికి కాజల్ 70-80 నుంచి లక్షల రూపాయిలు తీసుకుంటుంది. ‘మగధీర’ వంటి సూపర్ హిట్ తరువాత నుంచి కాజల్ ఇదే రేటును వసూళ్ళు చేస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ సరసన నటించడానికి కోటికి పైగా డిమాండ్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

గబ్బర్ సింగ్ తో హీరోయిన్ శృతిహాసన్ కు మంచి గుర్తింపు వచ్చింది.  హిట్  సినిమా సీక్వెల్ నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది. అయితే కాజల్ మాత్రం భారీ రెమ్యునరేషన్ డిమాండ్  చేస్తూ ఆ అవకాశాన్ని కాలదన్నుకునే విధంగా ప్రవర్తిస్తుందనే కామెంట్లు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: