గెడ్డంబాబు మరోసారి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. పట్టు వదలని విక్రమార్కుడు మాదరిగా మరోసారి మెగా ఫోన్ పట్టనున్నాడు.

నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జెడి చక్రవర్తి దర్శకుడుగా విజయవంతం కావడానికి ఇప్పటి వరకూ అనేక ప్రయత్నాలు చేసాడు. అయితే హిట్ కొట్టలేక పోయాడు. తాజాగా మరోసారి దర్శకత్వం చేయడానికి ఈ గెడ్డం బాబు సిద్ధపడుతున్నాడు. జెడీ చక్రవర్తి దర్శకత్వం వహించే కొత్త సినిమాను శ్రీ విఘ్నేష్ కార్తిక్ సినిమా, చక్రవర్తి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ ‘సాహసం, వినోదం కలబోసిన కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠను కలిగించే సినిమా ఇది. యువతను ఆకట్టుకునే రోడ్ మూవీస్ తరహాలో ఈ సినిమా ఉంటుంది. కొత్తవారితో ఈ సినిమా ఉంటుందని’ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: