షాడో పెరుచెబితే ఇప్ప‌డు బ‌య్య‌ర్లు మాత్ర‌మే కాదు... వెంకటేష్ కూడా భ‌య‌ప‌డుతున్నారు. మినిమం గ్యారెంటీ పేరు తెచ్చుకొన్న వెంకీ కెరియ‌ర్‌లో బిగ్గెస్ట్ ఫ్యాప్ ఇదేన‌ని సినీ పండితులు కూడా తేల్చేశారు. పెట్టుబ‌డిలో 30 శాతం కూడా తిరిగి రాద‌ట‌. బయ్య‌ర్లు, ఎగ్జిబీట‌ర్లు తీవ్ర‌స్థాయిలో న‌ష్ట‌పోయారు.

ఈ బాధితుల్లో వెంకీ కూడా ఉన్నాడ‌ట‌. త‌న పారితోషికంలో భాగంగా విశాఖ హ‌క్కుల‌ను త‌న పేర రాయించుకొన్నాడు వెంకీ. అక్క‌డ ఈ సినిమా క‌నీస వ‌సూళ్ల‌ను కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. దాంతో.. వెంకీ బావురు మంటున్నాడు. హ‌క్కుల బ‌దులు డ‌బ్బులు తీసుకొంటే బాగుండేదే.. అని ఇప్పుడు బాధ‌ప‌డుతున్నాడు.

చేతులు కాలిపోయాక‌.. ఆకులు ప‌ట్టుకొంటే ఏం లాభం??

మరింత సమాచారం తెలుసుకోండి: