జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘బాద్ షా’. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో బండ్ల గణేష్ తెరకెక్కించాడు. ఏప్రిల్ 5న విడుదల అయ్యిన ఈ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో దాదాపుగా 20 కోట్ల రూపాయిల నష్టం వచ్చినట్లు చెబుతున్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను 5 కోట్ల టేబుల్ లాస్ తో నిర్మాత విడుదల చేశాడు. సినిమా విడుదల తరువాత కూడా పంపిణీ దారులకు ఈ సినిమా నష్టానే మిగిల్చింది. సినిమాకు హిట్ సాధించినా ఆశించిన కలెక్షన్లు మాత్రం రాలేదు. దీంతో నిర్మాత, భారీ హక్కులకు చిత్ర రైట్స్ సొంతం చేసుకున్న పంపిణీదారులు కూడా ఈ నష్టాలను చూవిచూసినట్లు తాజా సమాచారం. ఈ నష్టం దాదాపుగా 20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘బాద్ షా’ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటించగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: