కుందనపు బొమ్మ సమంత వరుస సినిమాలతో సౌత్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈ భామ నటించిన సినిమాల్నీ హిట్ కావడంతో లక్కి భామగా పేరు తెచ్చుకుంది. దాంతో దీపం ఉన్నప్పుడే.. అన్న చందంగా.. తన రెమ్యూనరేషన్ ను కూడా ఏకంగా ఒక కోటి 75 లక్షలకు పెంచిందట ఈ భామ.

ఇటీవలే ఓ తెలుగు సినిమాకు ఒక కోటీ 75 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుందనే విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదే విషయాన్ని సమంతను అడిగితే సహజంగానే తప్పించుకుంది. అంతేకాదు తన మాటలు వాస్తవానికి దగ్గరున్నట్టుగా బిల్డప్ ఇస్తోంది. 'ముందు మీరు నిర్మాతలను వెళ్ళి అడగండి.. అంత డబ్బు తీసుకుంటున్నట్లు వారు చెబితే ఆ.. డబ్బంతా మీకిచ్చేస్తా' అంటూ చాలెంజ్ విసురుతోంది. ఇంతవరకూ కోటి రూపాయల రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని.. డబ్బు విషయంలో చాలా మొహమాటస్తురాలునని.. ఈ భామ చెప్పుకొచ్చింది. ఎంతైనా సమంతా మాటలు కూడా బాగానే నేర్చిందంటున్నారు సినీ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: