వైవిఎస్ చౌదరి.. వ‌రుస‌గా సినిమాలు ప్ర‌క‌టించి మీడియా దృష్టిని ఆక‌ర్షించాడు. త‌న సొంత బ్యాన‌ర్‌లో ఏకంగా నాలుగు సినిమాల్ని టైటిళ్ల‌తో స‌హా ప్ర‌క‌టించాడు. వాటిలో అంద‌రినీ ఆకట్టుకొంటున్న సినిమా ఒక్క‌టే... సీ.ఎమ్‌. కామ‌న్ మెన్ అనేది ఉప‌శీర్షిక‌. ఈ సినిమాని బాల‌కృష్ణ‌తో తీస్తా... అని చౌద‌రి అప్పుడెప్పుడో ప్ర‌క‌టించాడు.

కానీ ఒక్క‌మ‌గాడు రిజ‌ల్ట్ చూశాక బాల‌కృష్ణ చౌద‌రికి ఆ ఛాన్స్ ఇవ్వ‌డ‌నేది సుస్ప‌ష్టం. బాల‌కృష్ణతో సీఎమ్ పేరుతో ఓ సినిమా మొదలుకానుంది.. అని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే వెంట‌నే.. చౌద‌రి ప్రెస్‌మీట్ పెట్టి.. సీఎమ్ టైటిల్ నాది- ఎవ‌రితోనూ సినిమా చేయ‌డం లేద‌ని స్పష్టం చేశాడు. మ‌రి ఇప్పుడు సీఎమ్‌గా ఎవ‌రు క‌నిపిస్తారు. బాల‌కృష్ణ‌తోనే తీస్తాడా?  లేదంటే మ‌రో క‌థానాయ‌కుడిని ఎంచుకొన్నాడా..?  ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చౌద‌రికి సీఎమ్ సినిమా చేసేంత ఆర్థిక బ‌లాలు, ద‌మ్మూ ఉన్నాయా?  ఇవ‌న్నీ స‌మాధానాలు లేని ప్ర‌శ్న‌లు.

మరింత సమాచారం తెలుసుకోండి: