టాలీవుడ్ నవ మన్మథుడు గ్రీకువీరుడుగా వచ్చేశాడు. నాగ్-నయనతార జంటగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్రీకువీరుడు ఈ రోజు విడుదలైంది. నాగార్జున చందు పాత్రలో అమెరికాలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తున్న వ్యక్తిగా కనిపించారు. ప్రేమ, హ్యూమన్ రిలేషన్ షిప్‌పై నమ్మకం లేదని వ్యక్తి. డబ్బుకు ఎక్కువ విలువ ఇస్తాడు.

చారిటబుల్ ట్రస్టులో డాక్టర్ గా సంధ్య పాత్రలో నయనతార నటించింది. సంధ్య రిలేషన్, లవ్, సెంటిమెంట్స్ మీద నమ్మకం ఎక్కువ. ఇండియాకు వచ్చిన చందుకు సంధ్యతో పరిచయం ఏర్పడుతుంది. సంధ్య వల్ల చందు ఎలా మారాడు అనేదే కథ. నాగ్ ఎక్కువ సేపు మూడీగా ఉండే పాత్రలో కాస్త బోర్ కొట్టించాడట. నయనతారతో కెమిస్ర్టీ పండినప్పటికీ స్ర్కీన్ ప్లే కాస్త డల్ గా ఉన్నట్టు చెబుతున్నారు.

ఈ సినిమాలో కామెడీ పార్ట్ బాగుంది. ఎమ్.ఎస్ నారాయణ, కోవై సరళ, బ్రహ్మానందంలపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు అలరిస్తాయి. పెళ్లికాని బ్రహ్మచారిగా బహ్మీ పాట్లు, నయనతారతో వన్ సైడ్ లవ్ లో బ్రహ్మీ సన్నివేశాలు బాగున్నాయి. రఘుబాబు కూడా తన కామెడీని పండించాడు. అయితే సినిమా అంచనాలకు తగిన విధంగా లేదని ఫిలింనగర్ జనాలు అంటున్నారు. యావరేజ్ అనే టాక్ వినిపిస్తోంది. నితిన్ మూవీ 'సంబరం' తరహాలో కాస్త స్లోగా ఉందని అంటున్నారు. మరి ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఏంటో సంపూర్ణంగా కాసేపట్లో రివ్యూ అందిస్తున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: