నాగార్జున గ్రీకు ‘వీరుడు’ కాలేకపోయారు, కాని ప్రేక్షకులను అంతగా నారాజ్ చేయలేదు. ఎంతో అంచనాలతో వెలితే మాత్ర పప్పులో కాలేసినట్టే, సినిమా చూద్దాం ఓరెండున్నర గంటలు కాలక్షేపం చేద్దాం అనుకుంటే మాత్రం తప్పులేదు.

ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమా కథ ఏంటి, అసలు హీరో ఇంత బ్యాడా, డబ్బుకోసం అయిన వారిని మోసం చేయడం ఏమిటి, నిజంగా సినిమా ముందుకు ఎలా పోతుంది అన్న అనుమానాలను కలిగించి, స్లో గా నడిపించిన వైనం బోర్ కొట్టించింది. అయితే హీరోయిన్ నయనతార తెరపైకి రావడంతో సినిమాలో కొంత చలనం వచ్చింది, అప్పటి దాక ఇదేం సినిమారా బాబు అన్నవారంతా కాస్తా సినిమాను చూడడం మొదలు పెడుతారు. ఫస్ట్ హాఫ్ లో ఎంఎస్ నవ్వుల పంట పండించడం సినిమాకు కొంత ప్రాణం పోసింది.

నయన తార  నాగార్జున బార్యగా నాగ్ కుటుంబంలో అడుగు పెట్టినప్పటి నుంచి సినిమా కాస్తా ఫరవాలేదనిపించింది. హీరో తానేంత బ్యాడో అన్న రహస్యాన్ని తాత విశ్వనాథ్ కు చెప్పడంతో అప్పటిదాక ఉత్కంఠతో ఉన్న ప్రేక్షకులను ఓస్ ఇంతేనా అంటూ ఇంటర్వెల్ లోనే నిట్టూర్పువిడిచేలా చేసారు. ఆతర్వాత నాగార్జున మారడం, నయనతార మనసును మార్చి తనతో పెళ్లికి ఒప్పుకునేలా చేయడం వరకు నడిచిన కథ బాగుంది అని అన్పించక పోయినా బాగాలేదని మాత్రం అనలేని పరిస్థితి. ఈక్రమంలో బ్రహ్మానందం, ఎంఎస్, జయప్రకాష్ రెడ్డి పండించిన హాస్యం సూపర్.

హీరో తన వాళ్లకు దగ్గరవడం, హీరోయిన్ మనసు చూరగొనే సంధర్బంలో, పిల్లల ఆఖరికోరిక తీర్చడంలో సెంటిమెంట్ ను బాగా పండించారు. యూత్ ను ఉర్రూతలూగించే ఏఒక్క ఘట్టం కూడా లేకపోవడం కలెక్షన్ల విషయంలో నిర్మాతకు మైనస్ పాయింట్. మనసు పెట్టి పనిచేయాలి, ఎదుటివారిని సంతోషపెట్టే అవకాశం ఒక్క మనుషులకే ఉంది, బందాలు, బంధుత్వాలు ఎంత ప్రధానమో అన్న నీతిని చూపడంలో గ్రీకువీరుడు సక్సెస్ అయ్యాడనొచ్చు.

సినిమా అంతా తెరపై మెల్లగా కదలడం, స్క్రీన్ ప్లే పొరపాటును ఎత్తిచూపింది, కథ మూలం బాగానే ఉన్న చూపించే విధానంలో డైరెక్టర్ ఫెయిలయ్యారు, పాటలు ఫరవాలేదు. కాని నాగార్జున ఫ్యాన్స్ ను మాత్రం అసంతృప్తికి లోను చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: